TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు

Published on: Mon Mar 17, 2025 8:56AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శని, ఆదివారాలతో పోలిస్తే సోమవారం (మార్చి 17) రద్దీ ఒకింత తగ్గినప్పటికీ టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి పది గంటలకు పైగా సమయం పడుతోంది.

సోమవారం (మార్చి 17) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 9 కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. ఇక ఆదివారం (మార్చి 16) శ్రీవారిని 82 వేల 721 మంది దర్శించుకున్నారు. వారిలో 27 వేల 261 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్ల 46 లక్షల రూపాయలు వచ్చింది.