తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటలు
Published on: Thu Feb 20, 2025 8:16AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం (ఫిబ్రవరి 20) ఉదయం శ్రీవారి దర్శనానికి భక్తులు 12 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటలకు పైగా సమయం పడుతోంది.
ఇక బుధవారం శ్రీవారిని మొత్తం 72 వేల 745 మంది దర్శించుకున్నారు. వారిలో 24 వేల 156 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 48 లక్షల రూపాయలు వచ్చింది.


