తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Published on: Wed Feb 19, 2025 8:53AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం (ఫిబ్రవరి 19) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు 14 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది.
ఇక మంగళవారం (ఫిబ్రవరి 18) శ్రీవారిని మొత్తం 68 వేల 427 మంది దర్శించుకున్నారు. వారిలో 21 వేల 66 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 81 లక్షల రూపాయలు వచ్చింది.


