TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Published on: Tue Feb 18, 2025 8:35AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం (ఫిబ్రవరి 17) శ్రీవారిని మొత్తం 60 వేల 784 మంది దర్శించుకున్నారు. వారిలో పాతిక వేల 521 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 20 లక్షల రూపాయలు వచ్చింది.

ఇక మంగళవారం (ఫిబ్రవరి 18) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 20 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది.