TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.67 కోట్లు

Published on: Mon Feb 17, 2025 8:54AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం (ఫిబ్రవరి 17) ఉదయం శ్రీవారి దర్శనం కోసం మూడు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది.

ఇక ఆదివారం శ్రీవారిని మొత్తం 79 వేల 705 మంది దర్శించుకున్నారు. వారిలో 24 వేల 836 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 67 లక్షల రూపాయలు వచ్చింది.