తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Published on: Sat Feb 15, 2025 8:15AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శనివారం (ఫిబ్రవరి 15) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో పది కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది.
ఇక శనివారం (ఫిబ్రవరి 14) శ్రీవారిని మొత్తం 64 వేల 527 మంది దర్శించుకున్నారు. వారిలో 23 వేల 129 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 70 లక్షల రూపాయలు వచ్చింది.


