శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు
Published on: Fri Feb 14, 2025 6:57AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారంతం సమీపిస్తుండటంతో భక్తుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తోంది. శుక్రవారం (ఫిబ్రవరి 14) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 31 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
టోకన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక గురువారం (ఫిబ్రవరి 13) శ్రీవారిని మొత్తం 60 వేల 203 మంది దర్శించుకున్నారు. వారిలో 21 వేల 793 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 77 లక్షల రూపాయలు వచ్చింది.


