TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Published on: Wed Feb 5, 2025 8:50AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం (ఫిబ్రవరి 5) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్ లో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా నేరుగా దర్శనానికి అనుమతిస్తున్నారు.

ఇక మంగళవారం శ్రీవారిని మొత్తం 73 వేల 599 మంది దర్శించుకున్నారు. వారిలో 16 వేల 069 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 21 లక్షల రూపాయలు వచ్చింది.