తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి మూడు గంటలు
Published on: Mon Feb 3, 2025 10:45AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం (ఫిబ్రవరి 3) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు ఆరు కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని బక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది.
ఇక ఆదివారం శ్రీవారిని మొత్తం 75 వేల 706 మంది దర్శించుకున్నారు. వారిలో 23 వేల 340 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 34 లక్షల రూపాయలు వచ్చింది.


