తిరుమలలో భక్తుల దర్దీ సాధారణం
Published on: Mon Jan 27, 2025 8:21AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం (జనవరి 27) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు రెండు కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది.
ఇక ఆదివారం శ్రీవారిని మొత్తం 72 వేల 742 మంది దర్శించుకున్నరు. వారిలో 22 వేల 466 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 67 లక్షల రూపాయలు వచ్చింది.


