TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలు

Published on: Fri Jan 24, 2025 8:28AM

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం (జనవరి 24) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 15 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలకు పైగా సమయం పడుతోంది. వారంంతం సమీపిస్తుండటంతో ఈ రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది.

గురువారం (జనవరి 23) శ్రీవారిని మొత్తం 56 వేల 225 మంది దర్శించుకున్నారు. వారిలో 19, 588 మంది తల నీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 95 లక్షల రూపాయలు వచ్చింది.