తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

posted on: Nov 30, 2024 7:37AM

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వారాంతం కావడంతో తిరుమలేశుని దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. శనివారం (నవంబర్ 30) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు పది కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక శుక్రవారం శ్రీవారిని 62 వేల 147 మంది దర్శించుకున్నారు. వారిలో 23 వేల 096 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 77 లక్షల రూపాయలు వచ్చింది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...