TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

శ్రీవారి సర్వదర్శనానికి 13 గంటలు

Published on: Fri Nov 29, 2024 8:40AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. వారాంతం సమీపించడంతో భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం (నవంబర్ 29) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు పాతిక కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 13 గంటలకు పైగా సమయం పడుతోంది.

ఇక గురువారం (నవంబర్ 28) శ్రీవారిని మొత్తం 56 వేల952 మంది దర్శించుకున్నారు. వారిలో  21 వేల 714 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రావారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 84 లక్షల రూపాయలు వచ్చింది.