తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Published on: Thu Nov 21, 2024 8:46AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం (నవంబర్ 21) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 9 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది.
ఇక బుధవారం (నవంబర్ 20) శ్రీవారిని మొత్తం 59 వేల 231 మంది దర్శించుకున్నారు. వారిలో 22 వేల 29 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల ఎనిమిది లక్షల రూపాయలు వచ్చింది.


