శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటలు
Published on: Thu Nov 14, 2024 8:31AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం (నవంబర్ 14) ఉదయం శ్రీవారి దర్శనం కోసం రెండు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనారికి ఎనిమిది గంటల సమయం పడుతోంది.
ఇక బుధవారం (నవంబర్ 13) శ్రీవారిని మొత్తం 66 వేల 441 మంది దర్శించుకున్నారు. వారిలో 20 వేల 639 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 12 లక్షల రూపాయలు వచ్చింది.


