తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

posted on: Nov 7, 2024 8:57AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. గురువారం (నవంబర్ 7) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 17 కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి  9 గంటలకు పైగా సమయం పడుతోంది.

ఇక బుధవారం శ్రీవారిని మొత్తం 66 వేల 163 మంది దర్శించుకున్నారు. వారిలో  పాతిక వేల 229 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.  శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 86 లక్షల రూపాయలు వచ్చింది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...