TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.23 కోట్లు

Published on: Wed Nov 6, 2024 8:46AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం (నవంబర్ 6) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 17 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలకు పైగా సమయం పడుతోంది.

ఇక మంగళవారం (నవంబర్ 5) శ్రీవారిని మొత్తం 68 వేల 146 మంది దర్శించుకున్నారు. వారిలో 22667 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 23 లక్షల రూపాయలు వచ్చింది.