తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు

posted on: Oct 5, 2024 7:20AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బ్రహ్మోత్సవాలతో పాటు వారంతం కూడా కావడంతో రానున్న రోజులలో భక్తులు తిరుమలకు పోటెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శనివారం ( అక్టోబర్ 5) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో క్యూ కాంప్లెక్స్ దాటి భక్తుల క్యైలైన్ ఏటీజీహెచ్ వరకూ సాగింది.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక శుక్రవారం శ్రీవారిని మొత్తం 54 వేల 866 మంది దర్శించుకున్నారు. వారిలో 28 వేల 657 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 2 కోట్ల 60 లక్షల రూపాయలు వచ్చింది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...