తిరుమలలో రద్దీ సాధారణం

posted on: Sep 26, 2024 8:50AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం (సెప్టెంబర్ 26) ఉదయం శ్రీవారి  దర్శనం కోసం భక్తులు ఆరు కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక బుధవారం శ్రీవారిని మొత్తం 77 వేల 939 మంది దర్శించుకున్నారు.

వారిలో 22 వేల 668 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 50 లక్షల రూపాయలు వచ్చింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...