తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

posted on: May 15, 2024 8:59AM

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు 19 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక మంగళవారం శ్రీవారిని మొత్తం 75వేల 783 మంది దర్శించుకున్నారు.

వారిలో 35 వేల 665 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 8 లక్షల రూపాయలు వచ్చింది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...