Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తిరుమలలో కొనసాగుతున్న భక్తుల దర్దీ
posted on: Mar 30, 2024 8:50AM
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం (మార్చి 30) శ్రీవారి ఉచిత సర్వదర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి బయట వరకూ క్యూలైన్ సాగింది.
టోకెన్లు లేని భక్తలకు స్వామి వారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక టైమ్ స్లాట్ దర్శనం కోసం భక్తులు పది కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. టైమ్ స్లాట్ భక్తులకు శ్రీవారి దర్శనానికి 5 గంటలకు పైగా సమయం పడుతోంది.
అలాగే మూడువందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనానికి 4 గంటలకు పైగా సమయం పడుతోంది. శుక్రవారం (మార్చి 29) శ్రీవారిని 60,958 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 31,245 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 41 లక్షల రూపాయలు వచ్చింది.


.webp)
.webp)


