తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటలు

posted on: Oct 7, 2023 9:25AM

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ తగ్గింది. శనివారం ఉదయం శ్రీవారి దర్శనానికి భక్తులకు డైరెక్ట్ లైన్ ద్వారా అవకాశం కల్పిస్తున్నారు.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది. ఇక శుక్రవారం శ్రీవారిని 72వేల 104 మంది భక్తులు దర్శించుకున్నారు.

వారిలో 25వేల 44 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 80లక్షల రూపాయలకు వచ్చింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...