TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Published on: Sat Oct 4, 2025 9:57AM

కలియుగ ప్రత్యక్ష దైవం కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిట లాడుతుంటుంది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా గత పది రోజులుగా భక్త జన సంద్రంగా మారిన తిరుమలలో ఇప్పుడు కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం కావడంతో శనివారం (అక్టోబర్ 4) భక్తులు తిరుమలేశుని దర్శనానికి పోటెత్తారు.

ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో వైకుంఠం కాంప్లెక్స్ లోని కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ ఆక్టోపస్ భవనం వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక శుక్రవారం శ్రీవారిని మొత్తం 73 వేల 581 మంది దర్శించుకున్నారు. వారిలో 28 వేల 976 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 2 కోట్ల 60 లక్షలు వచ్చింది.