TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Published on: Wed Oct 1, 2025 9:05AM

కలియుగ ప్రత్యక్ష దైవం కొలువై ఉన్న తిరుమల నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా భక్తులు తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు వస్తుంటారు. ఇప్పుడు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతుండటంతో తిరమల భక్త జన సంద్రంగా మారింది.

బుధవారం (అక్టోబర్ 1) తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో 14 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శానికి 15 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక మంగళవారం (సెప్టెంబర్ 30) శ్రీవారిని మొత్తం 73 వేల275 మంది దర్శించుకున్నారు. వారిలో 21 వేల 973 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 77 లక్షల రూపాయలు వచ్చింది.