Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
posted on: Jul 18, 2025 8:14AM
.webp)
గత వారం నుంచి తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్న విషయం తెలిసిందే. శుక్రవారం (జులై 18) తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి 20 గంటలకు పైగా సమయం పడుతోంది. శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న బక్తులతో కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయాయి. భక్తుల క్యూలైన్ శిలాతోరణం వరకు సాగింది. గురువారం (జులై 17) శ్రీవారిని మొత్తం 63,897 మంది భక్తులు దర్శించుకున్నారు.వారిలో 29,500 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.66 కోట్లు వచ్చింది.


.webp)



