Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు
posted on: Jun 14, 2025 9:01AM
.webp)
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం కావడంతో భక్తులు తిరుమలేశుని దర్శనానికి పోటెత్తుతున్నారు. శనివారం (జూన్ 14) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ శ్రీకృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకూ సాగింది.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక శుక్రవారం (జూన్ 13) శ్రీవారిని మొత్తం 75 వేల 96 మంది దర్శించుకున్నారు. వారిలో 36 వేల 262 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 93 లక్షల రూపాయలు వచ్చింది.






