Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
posted on: May 26, 2025 9:52AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. వేసవి సెలవులు ముగింపు దశకు వస్తుండటంతో భక్తులు తిరుమలకు పోటెత్తుతున్నారు. సోమవారం (మే 26) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ ఏటీజీహెచ్ వెలుపలి వరకూ సాగింది.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక ఆదివారం శ్రీవారిని మొత్తం 91 వేల 538 మంది దర్శించుకున్నారు. వారిలో 37 వేల 538 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 80 లక్షల రూపాయలు వచ్చింది.



.webp)


