Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
posted on: May 21, 2025 9:10AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. వేసవి సెలవులు ముగింపు దశకురావడం, వారాంతం సమీపిస్తుండటంతో తిరుమలేశుని దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. బుధవారం (మే 21) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ ఏటీజీహెచ్ వరకూ సాగింది.
ఇక మంగళవారం (మే 20) శ్రీవారిని మొత్తం 76 వేల మంది దర్శించుకున్నారు. వారిలో 31 వేల 766 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల ఏడు లక్షల రూపాయలు వచ్చింది.






