తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
posted on: Jan 31, 2025 8:46AM

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శుక్రవారం (జనవరి 31) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 3 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టైమ్ స్లాట్ భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుండగా, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది.
ఇక టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటలు పడుతోంది. ఇక గురువారం (జనవరి 30) శ్రీవారిని మొత్తం5 1,349 మంది దర్శించుకోగా, వారిలో 14 వేల 82 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.65 కోట్ల రూపాయలు వచ్చింది.


.webp)



