TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Published on: Sat Jan 25, 2025 8:29AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. వారాంతం కావడంతో ఈ రెండు రోజులూ తిరుమలకు భక్తుల పోటెత్తే అవకాశం ఉంది. శనివారం (జనవరి 25) ఉదయం శ్రీవారి దర్శనం కోసం 9 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి పది గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక శుక్రవారం (జనవరి 24) శ్రీవారిని మొత్తం 57 వేల 655 మంది దర్శించుకున్నారు. వారిలో 18వేల 614 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 2 కోట్ల 73లక్షల రూపాయలు వచ్చింది.