శ్రీవారి హుండీ కానుకల ఆదాయం రూ. 4.43 కోట్లు
Published on: Sun Jan 12, 2025 8:16AM
.webp)
తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. వైకుంఠ ద్వాదశి నాటు అంటే శనివారం (జనవరి 11) శ్రీవారిని మొత్తం 53 వేల 13 మంది దర్శించుకున్నారు.
వీరిలో 13 వేల 283 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 43 లక్షల రూపాయలు వచ్చింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా టీటీడీ ఏర్పాట్లు చేసింది.


