TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Published on: Sat Jan 4, 2025 8:05AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శనివారం (జనవరి 4) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్ లో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ క్యూలైన్ ద్వారా అనుమతిస్తున్నారు. అయితే టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది.

ఇక శుక్రవారం (జనవరి 3) శ్రీవారిని మొత్తం 56 వేల 550 మంది దర్శించుకున్నారు. వారిలో 28 వేల 853 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 34 లక్షల రూపాయలు వచ్చింది.