తిరుమలలో పెరిగిన రద్దీ
Published on: Thu Dec 26, 2024 7:47AM

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గురువారం (డిసెంబర్ 26) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి భక్తుల క్యూలైన్ ఎంబీసీ వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలకు పైగా సమయం పడుతోంది.
ఇక బుధవారం (డిసెంబర్ 25) శ్రీవారిని మొత్తం 73 వేల 301 మంది దర్శించుకున్నారు. వారిలో 26 వేల 242 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 14లక్షల రూపాయలు వచ్చింది.


