TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలు

Published on: Fri Dec 20, 2024 6:14AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం (డిసెంబర్ 20) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 29 కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలకు పైగా సమయం పడుతోంది.

ఇక గురువారం (డిసెంబర్ 19) శ్రీవారిని మొత్తం 58 వేల 165 మంది దర్శించుకున్నారు. వారిలో 20 వేల 377 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 60 లక్షల రూపాయలు వచ్చింది.