తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Published on: Wed Dec 18, 2024 7:02AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ కొనఃసాగుతోంది. బుధవారం(డిసెంబర్ 18) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 11 కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది.
మంగళవారం (డిసెంబర్ 17) శ్రీవారిని మొత్తం 63 వేల 598 మంది దర్శించుకున్నారు. వారిలో 20 వేల 102 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 59 లక్షల రూపాయలు వచ్చింది.


