TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Published on: Wed Dec 4, 2024 8:42AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం (డిసెంబర్ 4) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు ఒక కంపార్ట్ మెంట్ లో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది.

మంగళవారం (డిసెంబర్ 3) శ్రీవారిని మొత్తం 60 వేల 301 మంది దర్శించుకున్నారు. వారిలో  20 వేల 222 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 32 లక్షల రూపాయలు వచ్చింది.