తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Published on: Wed Nov 27, 2024 8:28AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం (నవంబర్ 27) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు నాలుగు కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్ లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది.
ఇక మంగళవారం శ్రీవారిని మొత్తం 65వేల 525 మంది దర్శించుకున్నారు. వారిలో 20 వేల 196 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 53 కోట్ల రూపాయలు వచ్చింది.


