తిరుమలలో స్వల్పంగా పెరిగిన భక్తుల రద్దీ

posted on: Nov 15, 2024 8:41AM

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ స్వల్పంగా పెరిగింది.  శుక్రవారం (నవంబర్ 15) ఉదయం శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు 19 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది.

అదే సమయంలో రూ.300లు ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు రెండు నుంచి మూడు గంటల సమయం పడుతోంది. ఇక గురువారం  స్వామి వారిని మొత్తం 56,711 మంది  దర్శించుకున్నారు. వరిలో 19,755 మంది   తలనీలాలు సమర్పించుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ  ఆదాయం రూ.3.64 కోట్లు వచ్చింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...