తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Published on: Sun Nov 3, 2024 7:01AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. ఆదివారం(నవంబర్ 3) ఉదయం శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి భక్తుల క్యూలైన్ శిలాతోరణం వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది.
శనివారం శ్రీవారిని మొత్తం 88వేల 076 మంది దర్శించుకున్నారు. వారిలో 36వేల 839 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 52 లక్షల రూపాయలు వచ్చింది.


