తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Published on: Sat Oct 26, 2024 9:52AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శనివారం(అక్టోబర్ 26) ఉదయం శ్రీవారి దర్శనం కోసం 5 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది.
ఇక శుక్రవారం శ్రీవారిని మొత్తం 56వేల501 మంది దర్శించుకున్నారు. వారిలో 21 వేల 203 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 78 లక్షల రూపాయలు వచ్చింది.


