తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Published on: Fri Oct 18, 2024 9:39AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. శుక్రవారం (అక్టోబర్18) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 26 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది.
ఇక గురువారం (అక్టోబర్ 17) శ్రీవారిని మొత్తం 58 వేల 637 మంది దర్శించుకున్నారు. వారిలో 21 వేల 956 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 69 లక్షల రూపాయలు వచ్చింది.


