తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు
Published on: Fri Oct 11, 2024 9:44AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. గురువారం(అక్టోబర్ 11) ఉదయం శ్రీవారి దర్శనానికి వేచి ఉన్న భక్తులతో 26 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది.
ఇక బుధవారం (అక్టోబర్ 10) శ్రీవారిని మొత్తం 60 వేల 775 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో పాతిక వేల 288 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 88 లక్షల రూపాయలు వచ్చింది.


