తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
Published on: Tue Oct 8, 2024 9:59AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. దసరా సెలవలు, శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. మంగళవారం (అక్టోబర్ 8) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయాయి.
భక్తుల క్యూలైన్ వకుళమాత రెస్ట్ హౌస్ వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతోంది. ఇక సోమవారం (అక్టోబర్ 7) శ్రీవారిని మొత్తం 81 వేల 481 మంది దర్శించుకున్నారు. వారిలో 38 వేల 762 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 31 లక్షల రూపాయలు వచ్చింది.


