తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
Published on: Sun Sep 1, 2024 7:36AM
తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. ఆదివారం (సెప్టెంబర్ 1) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో ఐదు కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
టోకెన్లు లేని శ్రీవారి భక్తులకు సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది. ఇక శనివారం (ఆగస్టు 31) శ్రీవారిని మొత్తం 81 వేల 207 మంది దర్శించుకున్నారు.
వారిలో 31 వేల 414 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 53 లక్షల రూపాయలు వచ్చింది.


