తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Published on: Mon Aug 26, 2024 10:26AM
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. సోమవారం ఆగస్టు 26)ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయాయి. భక్తుల క్యూలైన్ టీబీసీ వరకూ సాగింది.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక ఆదివారం శ్రీవారిని మొత్తం 84వేల60 మంది దర్శించుకున్నారు. వారిలో 34 వేల 985 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల లక్ష రూపాయలు వచ్చింది.


