తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు

posted on: Mar 17, 2024 7:29AM

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం (మార్చి 17) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ ఏటీసీ వరకూ సాగింది.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక శనివారం (మార్చి 16) శ్రీవారిని 74వేల 351 మంది భక్తులు దర్శించుకున్నారు.

వారిలో 34వేల 164 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల నాలుగు లక్షల రూపాయలు వచ్చింది. 
 

google-ad-img
    Related Sigment News
    • Loading...