TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Published on: Sun Oct 27, 2024 10:05AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఆదివారం అక్టోబర్ 27) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్ లో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ క్యూలైన్ ద్వారా అనుమతిస్తున్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది.

ఇక శనివారం (అక్టోబర్ 26) శ్రీవారిని మొత్తం 77 వేల 844 మంది దర్శించుకున్నారు. వారిలో 27 వేల 418 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం 3 కోట్ల 27 లక్షల రూపాయలు వచ్చింది.