TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Published on: Sun Jul 27, 2025 9:50AM

తిరుమలలొ శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం కావడంతో తిరుమల కొండ భక్త జన సంద్రంగా మారింది. ఆదివారం (జులై 27) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయాయి. భక్తుల  క్యూలైన్ ఎన్ జీ షెడ్స్ వరకూ సాగింది.  టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలకు పైగా సమయం పడుతోంది.

 అలాగే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు తీసుకున్న భక్తులకు స్వామి వారి దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది.  ఇక శనివారం శ్రీవారిని మొత్తం 68 వేల  229 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో  30,559 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్ల 2 లక్షల రూపాయలు వచ్చింది.