TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Published on: Sun Jun 1, 2025 9:09AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు ముగింపు దశకు వస్తుండటం, వారాంతం కావడంతో తిరుమల గిరులు భక్త జనసంద్రంగా మారాయి.  ఆదివారం (జూన్ 1) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మంట్లన్నీ నిండిపోయి క్యూ లైన్ శిలా తోరణం వరకూ సాగింది.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక శనివారం (మే 31) రికార్డు స్థాయిలో భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం శ్రీవారిని మొత్తం 95 వేల 80 మంది శ్రీవారిని దర్శించుకోగా వారిలో 39 వేల 668 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండా కానుకల ఆదాయం 3 కోట్ల 47లక్షల రూపాయలు వచ్చింది.