TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు

Published on: Fri May 23, 2025 7:54AM

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం సమీపిస్తుండటం, వేసవి సెలవులు కలిసి రావడంతో తిరుమలేశుని దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. శుక్రవారం (మే 23) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లననీ నిండిపోయాయి. భక్తుల క్యూలైన్ శిలాతోరణం వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది.

ఇక గురువారం (మే 22) శ్రీవారిని 72 వేల 679 మంది దర్శించుకున్నారు. వారిలో 34 వేల 67 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 74 లక్షల రూపాయలు వచ్చింది. అదలా ఉంచితే తిరుమల తిరుపతి దేవస్థానం ఆగస్టు నెలకు సంబంధించి దర్శన టికెట్లను శుక్రవారం (మే 23) విడుదల చేయనుంది.

ఉదయం పది గంటలకు  ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ టోకెన్లు,  11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు విడుదల చేస్తుంది. మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధుల, వికలాంగుల దర్శన టిక్కెట్లు విడుదల చేస్తుంది. ఇక శనివారం (మే 24) ఉదయం పది గంటలకు ఆగస్టు నెలకు సంబంధించి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది.